🇮🇳 🏆 విజయనిర్మల (గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందిన ప్రముఖ మహిళ దర్శకురాలు )
🇮🇳 🏆 విజయనిర్మల (గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందిన ప్రముఖ మహిళ దర్శకురాలు )
Admin
Author
🎬 విజయ నిర్మల — నటి, దర్శకురాలు, నిర్మాత.
(గిన్నిస్ వరల్డ్ రికార్డు)
విజయ నిర్మల తెలుగు సినిమా చరిత్రలో నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ సినీ వ్యక్తిత్వం. ఆమె ఆరు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగారు
🌟 పూర్తి పేరు: నిడదవోలు నిర్మల
జననం: 20 ఫిబ్రవరి 1946
చిన్న వయసులోనే బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించారు.
తమిళ చిత్రం **మత్స్యరేఖై (1950)**తో బాలనటిగా కెరీర్ ప్రారంభించారు.
**పాండురంగ మహాత్మ్యం (1957)**లో బాలకృష్ణుడి పాత్రలో నటించి గుర్తింపు పొందారు.
మేల్ డామినేటెడ్ సినీ పరిశ్రమలో సాధికారికంగా నిల్చున్న ధీశాలి ఆమె, ప్రపంచములో అత్యథిక సినిమాలను రూపొందించిన "గిన్నీసుబుక్ లేడీ డైరెక్టర్" ఆమె బాలనటిగా, హీరోయిన్గా నిర్మాతగా, దర్శకురాలిగా “విజయనిర్మల" గారు బహుముఖ ప్రజ్ఞాశాలి నవలలను సినిమాలుగా మలచడంలో ఆమెది అందె వేసిన చేయి ఆమె సాహసాల "రంగులరాట్నం” ప్రయోగాల “మీనా” చిత్ర పరిశ్రమ మేడమ్" అని పిలుచుకునే విజయనిర్మలగారు.
విజయనిర్మల అసలు పేరు "నిర్మల” 1944-2-20 తేది మద్రాసులో జన్మించింది. ఆమె తండ్రి “సమర్ది రామ్మోహనరావు తల్లి శంకుతలా దేవి (పసుపులేటి) ఆమెది నరసారావుపేట. వీరి మేనమామ కుటుంబం నర్సారావుపేట జమిందారీలో ఉద్యోగులు. తెలగ కుటుంబం. తండ్రిది కృష్ణాజిల్లా ఆయన వాహిని స్టూడియోలో చీఫ్ ప్రొడక్షన్ ఆపరేటర్‌గా ఉండేవారు. రావు బాలసరస్వతి (గాయని, నటి (సూపర్ స్టార్) గారు. విజయనిర్మల తండ్రి గారికి అక్కకుమార్తె అనగా మేనకోడలు, నిర్మలకు వదిన వరుస అవుతారు. నటి జయసుధ, విజయనిర్మల పెదనాన్న గారి మనుమరాలు ఆమెకు మేనకోడలు వరుస అవుతారు. వీరిది ఉమ్మడి కుటుంబం.
రావు బాలసరస్వతి గారు నిర్మల 7 సం॥ వయస్సుల్లో వారింట్లో నిదుర పోతుండగా ఆమెను ఎత్తుకొని తన యింటికి తీసుకెళ్లి తమిళ సినిమా డైరెక్టరు. బాలనటి కావాలని బాల సరస్వతిని కోరగా ఆమె నిర్మలను తీసుకుపోయి స్టూడియోలో నిలబెట్టింది. మచ్చురేకై (మత్స్యరేఖ) తమిళ సినిమాలో నటించింది. అలా వెండితెరమీద అడుగుపెట్టింది. ఆరు తమిళసినిమాలలో నటించింది తర్వాత “సింగారి” మనం పోల్ మాంగల్యం "హమ్ పంచీ ఏక్ దాల్ కీ" (హింది) బాలనటిగా ఆమె చివరి చిత్రం భూకైలాస్ (1958) బాల నటికి ఎక్కువ హీరోయిన్‌కి తక్కువ అనిపించే టినేజ్, అటువంటి వయస్సులో వచ్చిన విరామాన్ని, చదువుకు డ్యాన్స్ ప్రాక్టీస్‌కు ఉపయోగించుకున్నారు. 10వ తరగతి పూర్తయ్యాక చదువుకు ఫుల్స్టాప్ పెట్టి 1964 సం॥లో వచ్చిన మళయాళ చిత్రం “భార్గవనిలయం” హీరోయిన్గా వెండితెరపై రీ ఎంట్రీ యిచ్చింది. తెలుగులో "షావుకారు” సినిమాను విజయాసంస్థ తమిళంలో "ఎంగవీట్టు పెణ్” సినిమాలో నటించింది.
విజయనిర్మల 13 సం|| వయస్సులో "పాండురంగ మహాత్మ్యం” సినిమాలో “జయకృష్ణ ముకుందామురారి" పాటలో విజయనిర్మల బాలకృష్ణుడిగా N.T.R. పర్యవేక్షణలో నటించింది. ఆయనెంతో ప్రోత్సహించారు అది చాలా పెద్ద పాట. NTR విజయనిర్మలకు మేకప్ సరిదిద్దడం, కళ్ళ చివర శంఖు చక్రాలు దిద్దడం చేసేవారు. సినీ ఆటోగ్రాఫర్ విన్సెంట్ గారు. మళయాళ దర్శకుడిగా ఒక సినిమా తీయదలిచాడు. ఆయనవాహిణి స్టూడియోలో పనిచేస్తున్నప్పుడు ఆమె తండ్రికి స్నేహితుడు ఆయన తీసిన బార్గవ నిలయం సినిమాలో నటించింది. ఆ సినిమా హిట్టయింది. తర్వాత 12 సినిమాలకు పైగా మళయాళంలో నటించింది.
1967 బి.ఎన్.రెడ్డి గారి "రంగులరాట్నం" సినిమాతో తొలిసారి తెలుగులో హీరోయిన్గా నటించింది. అది కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా, క్లాసికల్ సినిమాగా నిలిచి ఆమెకు పేరు తెచ్చింది.
ఆ విజయనిర్మల అసలు పేరు నిర్మల "వెన్నిరాడై నిర్మల" అనే హీరోయిన్ సినీ పరిశ్రమలో ఉండుటచే నిర్మలను విజయనిర్మలగా పేరు మార్చుకుంది. నిర్మల పేరు నీరజగా మారగా బి.ఎన్.రెడ్డిగారు విజయనిర్మలగా మార్చారు
విజయనిర్మలగారికి మొదటి వివాహమైంది. ఆమె భర్త P. క్రిష్ణమూర్తి నాయుడు. షిప్పులు తయారు చేసే కంపెనీలో ఇంజనీరుగా పని చేసేవారు ఆ దంపతుల కుమారుడే V.K నరేష్ (నటుడు - మా అధ్యక్షులు) ఇతని కుమారుడు హీరో నవీన్.
🎭 హీరోయిన్గా
మలయాళ చిత్రం **భార్గవి నిలయం (1964)**తో కథానాయికగా మంచి గుర్తింపు పొందారు. తెలుగులో రంగుల రత్నం (1966) ద్వారా కథానాయికగా ప్రవేశించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించినట్లు పలు ఆధారాలు పేర్కొంటున్నాయి.
కృష్ణతో కలిసి 40కి పైగా చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ తెరపై ప్రముఖ జంటగా గుర్తింపు పొందారు.
బాపు-రమణల సొంత నిర్మాణసంస్థ తీసిన “సాక్షి” సినిమాలో హీరో “కృష్ణ”తో కలిసి నటించడం ఆమె జీవితాన్ని కృష్ణజీవితాన్ని కూడా మార్చింది. గోదావరి నదీ ప్రాంతములోని "మీసాల కృష్ణుని" గుడిలో “అమ్మ కడుపు చల్లగా” పాటలో కృష్ణ -విజయనిర్మలకు తాళికట్టే సన్నివేశంలో నటించారు. షూటింగ్ ముగిసి బయటకు వచ్చేటప్పుడు, రాజబాబు ఇది మీసాలకృష్ణుడి గుడి, చాలా పవర్ఫుల్, ఇక్కడ ఉత్తుత్తి జంటయినా నిజమైన జంట అయిపోతుంది అని అన్నాడు. తర్వాత నాలుగు నెలలలో అది నిజమైంది. నాలుగు సినిమాలలో జంటగా నటిస్తున్న కృష్ణ - విజయనిర్మల, కృష్ణ మంచితనం ఇతరులకు సహాయపడే గుణం విజయనిర్మలకు నచ్చాయి. ఆమె చలాకితనం, మంచితనం కృష్ణను ఆకట్టుకుంది. విజయనిర్మల భర్త నుండి విడాకులు పొంది 24-3-1969 విజయనిర్మల, కృష్ణతో కులాంతర వివాహము తిరుపతి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో వివాహమాడారు. వీరిద్దరిది ద్వితీయ వివాహమే కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి ఆమె పిల్లలు రమేష్ (హీరో) మహేష్ బాబు (హీరో) మంజుల (నిర్మాత) ఉన్నారు. ఆ పెళ్ళి సమయంలో ఇండస్ట్రీలో న్యూస్ క్రియేట్ చేసినా క్రమంగా అందరూ ఆ జంటను ఆదరించారు.
ఘట్టమనేని శివరామకృష్ణ (హీరోకృష్ణ) సరసన హీరోయిన్ విజయనిర్మల 51 సినిమాల్లో నటించింది. భర్త ప్రోత్సాహంతో ఇతర హీరోల ప్రక్కన కూడా నటించింది. విజయనిర్మల దర్శకత్వము వహించి తొలి తెలుగు సినిమా “మీనా" (1973) అంతకుముందు మళయాళం సినిమా "కవిత”కు దర్శకత్వం వహించారు. అందులో S.V.రంగారావు గారు కూడా నటించారు. మూడవ చిత్రం “దేవదాసు” (1974) ఎన్నో విమర్శలు, వివాదాలు ఎదుర్కొనగా ఆత్మ విశ్వాసంతో ఆ చిత్రం పూర్తిచేశారు. మళయాళంలో విజయం సాధించిన తన తొలిచిత్రం, అదే పేరుతో (కవిత) తెలుగులో రూపొందించారు. తర్వాత “దేవుడే గెలిచాడు” టెక్నికల్‌గా గొప్పపేరు తెచ్చింది. 1972 నుండి 1996 వరకు నిర్విరామంగా సాగిన తన దర్శకత్వ కేరియర్ ఎన్నో అద్భుత విజయాలు, అనూహ్య పరాజయాలు చవి చూశారు. అక్కినేని నాగేశ్వరరావు - కృష్ణగారి కాంబినేషన్ "హెమాహెమీలు", శివాజీ గణేశన్ కృష్ణ కాంబినేషన్‌తో “బెజవాడ బెబ్బులి” రామ్-రాబర్ట్-రహీమ్, కృష్ణ రజనీకాంత్ గారి కాంబినేషన్‌తో దర్శకత్వం చేయడం నా జీవితంలో మరచిపోలేని సంఘటనగా విజయనిర్మల చెప్పేవారు. డాక్టర్ సినీయాక్టర్ - రక్తసంబంధం, చిత్రాలు, మూడు పాత్రలలో కృష్ణగారిని డైరెక్ట్ చేయడం, ముఖ్యమంత్రి సాహసమే నా ఊపిరి, మొదలగు 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు.
1999 సం||లో కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గము నుండి తెలుగుదేశం పార్టీ M.L.A గా పోటీచేసి పరాజయం పాలయ్యారు. (ఆమె సర్టిఫికేట్ “కాపు”గానే సమర్పించింది
ఎన్నో చిత్రాలకు అసోసియేటెడ్ డైరెక్టరుగా పనిచేశారు. ఆ అనుభవం, అవగాహనతోనే ఆమె దర్శకురాలయ్యారు. మళయాళ చిత్రం కవిత (1973)తో మెగాఫోన్ చేపట్టిన విజయనిర్మల తొలిసారిగా తెలుగులో "మీనా" (1973) చిత్రానికి దర్శకత్వం వహించింది
🏆 గిన్నిస్ వరల్డ్ రికార్డు
ఇరవై ఏడు చిత్రాలకు దర్శకత్వం వహించిన “ఇటలీ దర్శకురాలు” రికార్డును చెరిపివేసి 44 చిత్రాలతో 2002 సం॥లో "గిన్నీసుబుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు"లో తన పేరు నమోదు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2008 సం॥లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు ప్రకటించింది. 17-3-2010 సం॥లో ఆ అవార్డు అందుకున్నారు. బానుమతి తర్వాత మహిళా దర్శకులలో రెండవ వారు మద్రాసులో ఆమె మనుమడు "నవీన్" పేరుతో నవీన్ ఇంటర్నేషనల్ పేరున "త్రీ స్టార్ హెూటల్" నెలకొల్పి చాలాకాలం నడిపారు. విజయకృష్ణ పేరుతో డబ్బింగ్ థియేటర్, రికార్డింగ్ స్టూడియో ఔట్ డోర్ యూనిట్ అలాగే “ప్లానెట్-10” పేరుతో - ఫ్యామిలీ క్లబ్ చాలాకాలం నిర్వహించారు. ఇప్పుడు ఆ ప్రదేశంలో ఒక హెూటల్ బహుళ అంతస్థులభవనం ఉన్నాయి.
అమ్మ నాకు అమ్మ మాత్రమే కాదు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ కూడా అని "మా అధ్యక్షులు" విజయనిర్మల కృష్ణమూర్తి నరేష్ (V.Kనరేష్) అన్నారు. గిన్నీసుబుక్ సాధించిన ఆమెకు, భారత ప్రభుత్వం పద్మశ్రీ లేదా పద్మభూషణ్ ఇచ్చి గౌరవిస్తే బాగుండేది.
విజయనిర్మల గారు - 27 జూన్ 2019 సం|| స్వర్గస్తులయినారు. సంపూర్ణ స్త్రీ - సమాజం స్ఫూర్తి పొందేలా తన జీవితాన్ని సఫలం చేసుకుంది.
పొన్నూరి రాఘవేంద్ర
No comments yet. Be the first to comment!