🇮🇳 పద్మభూషణ్ శోభన (సినీ కథానాయిక)

🇮🇳 Padmabhushan Shobana 

        శోభన చంద్రకుమార్ పిళ్లై (Shobana Chandrakumar Pillai) భారతీయ సినీ నటి, ప్రముఖ భరతనాట్యం కళాకారిణి, నృత్య దర్శకురాలు. ఆమె ప్రధానంగా మలయాళ చిత్రాలతో పాటు తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు.

జననం: 21 మార్చి 1970

కేరళకు చెందిన ప్రముఖ నృత్య కుటుంబ వారసత్వంతో పెరిగారు.

1984లో ‘April 18’ మలయాళ చిత్రంతో కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేశారు. 

      నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగిన కెరీర్‌లో 225కి పైగా/230 వరకు చిత్రాల్లో నటించినట్లు అధికారిక మరియు ప్రభుత్వ వనరులు పేర్కొంటున్నాయి. 

🏆 జాతీయ పురస్కారాలు

ప్రముఖ నటి, భరతనాట్య నృత్యకారిణి శోభన చంద్రకుమార్‌కు 2025 సంవత్సరానికి గాను భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ లభించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు

    🏆 శోభనకు రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది:

Manichitrathazhu (1993) – గంగ/నాగవల్లి పాత్ర

Mitr, My Friend (2001) – ప్రధాన పాత్ర

Manichitrathazhu చిత్రానికి ఆమెకు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు కూడా లభించింది.

💃 భరతనాట్యం

శోభన సినీ నటిగా మాత్రమే కాకుండా ప్రముఖ భరతనాట్యం కళాకారిణిగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆమె చిత్రా విశ్వేశ్వరన్ మరియు పద్మా సుబ్రహ్మణ్యం వంటి ప్రముఖ గురువుల వద్ద శిక్షణ పొందారు. చెన్నైలో Kalarpana నృత్య పాఠశాలను నిర్వహిస్తూ నృత్యాన్ని బోధిస్తున్నారు. 

🇮🇳 పద్మశ్రీ & ఇతర గౌరవాలు

పద్మశ్రీ – 2006, కళారంగానికి చేసిన సేవలకు.

కలైమామణి – 2011, తమిళనాడు ప్రభుత్వం.

కళారత్న – 2013, కేరళ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్.

కళారంగ సేవలు: గత 50 ఏళ్లుగా భరతనాట్యంలో రాణిస్తూ, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. చెన్నైలో 'కలర్పణ' అనే నాట్య పాఠశాలను నిర్వహిస్తున్నారు.

🎥 గుర్తుండిపోయే చిత్రాలు

Manichitrathazhu, Innale, Thenmavin Kombathu, Rudra Veena, Mitr: My Friend తదితర చిత్రాలు ఆమె సినీ ప్రయాణంలో ముఖ్యమైనవి. Thenmavin Kombathu కూడా 2026లో పునఃవిడుదలకు సిద్ధమైంది. 

           శోభన భారతీయ సినీ రంగంలో నటిగా, అలాగే భరతనాట్య కళాకారిణిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. రెండు జాతీయ ఉత్తమ నటి అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి గౌరవాలు ఆమె కళా ప్రయాణంలో ముఖ్యమైన మైలురాళ్లు. 

            శోభన ను  దక్షిణాది రాష్ట్రాలో ఎవరికి వారు తమ అమ్మాయే అనుకుంటారు. ఆమెను ఇరవై సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తున్నా ఆమెను చూస్తుంటే ఆమెకు ఇంకా పాతికేళ్ళ వయస్సు అన్నట్లు కనిపిస్తుంది. కనికట్టుతో సినిమా, నాట్యం, రెండు రంగాలలోనూ అభిమానులను సంపాదించిన శోభన. 

 జన్మదినం 21-3-1966.

        శోభన తండ్రి డా|| చంద్రకుమార్ తల్లి ఆనందం (ఇంజనీర్) (బ్రాహ్మణ) ఈ దంపతుల ఏకైక కుమార్తె శోభన, బలిజ నాయర్ కుటుంబం. ఆ రోజుల్లో దక్షిణాది మధ్యతరగతి కుటుంబాల వారు తమ పిల్లలకు నాట్యం, సంగీతం, నేర్పించేవారు. నా విషయంలోనూ అదే జరిగింది. నాట్యంలో శిక్షణ ఇవ్వడానికి "కళార్పణ” పేరుతో చెన్నైలో డాన్స్ స్కూలు ప్రారంభించాను. మొదట్లో డాన్స్ అంటే మ్యాథ్స్, సైన్సులాగా ఓ సబ్జెక్టు ఏడేండ్ల క్రిందట నా కెరీయర్లో డ్యాన్స్ సినిమా తమ పాత్రలు మార్చుకున్నాయి. ఇప్పుడు డ్యాన్స్ నాకు తొలి ప్రాధాన్యం. ఉదయాన్నే ఐదింటికి మొదలవుతుంది. నా దినచర్య ఆరోజు క్లాసులకి సిద్ధం కావడం. సంగీతం వినడం, డాన్స్ షోలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం... ఇలా సాగుతుంది. “అభినయ” పేరుతో నేను డ్యాన్సులో ప్రయోగాలు చేస్తున్నాను. మూర్తిమత్వంపై పూర్తి నియంత్రణ ఉంచాల్సిన డ్యాన్సు అది.

        సినిమా భరతనాట్యం ఏది ముఖ్యమో తేల్చుకోలేక తలపోటెక్కేది. టీనేజ్ లో మరోప్రక్క సినిమా అవకాశాలను వదులుకోలేక పోయాను. మూడేళ్ళ వయస్సులో డ్యాన్సుతో, తొమ్మిడేండ్లకు సినిమాతో నాకు పరిచయం నా తొలి చిత్రానికే బాలనటి అవార్డు వచ్చింది. పదిహేడేండ్లపుడు మళయాళంలో మంచి హిట్ దొరికింది. తర్వాత సినిమాలు వరుస కట్టాయి. సినిమాల బిజీలో డ్యాన్సు తగ్గించాను. కానీ వీలుచిక్కిన ప్రతిసారీ దేశ విదేశాలలో నాట్యప్రదర్శనలిచ్చాను.

        ప్రఖ్యాత భరతనాట్య కళాకారులు - లలిత, పద్మిని, రాగిణి (ట్రావెంకూర్ సిస్టర్స్) సినీనటీమణులు, శోభనకు “పిన్ని” వరుస అవుతారు. శోభన నాకు పద్మినీయే రోల్ మోడల్ అంటుంది.

    1994 సం||లో మళయాళంలో వచ్చిన “మణిచిత్ర తాళ్” అనే సినిమా నా కెరీర్నే మార్చేసింది. నటిగా నాకు జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చిన సినిమా అది ఇప్పుడు తెలుగు, తమిళ, ప్రేక్షకులు, పిలుచుకుంటున్న చంద్రముఖి పాత్రను మొదట చేసింది నేనే ! మణిచిత్రతాళ్ రీమేక్ లు తీయడం నన్ను వార్తల్లో వ్యక్తిని చేస్తోంది. నేనెప్పటికీ గుర్తుంచుకునే సినిమా అది.

            చారెడేసి కళ్లతో బలే అందంగా ఉంటావని నన్ను మెచ్చుకుంటే సంతోషంగానే ఉన్నా ఈ కళ్ళతో నటిగా అదనపు ఇబ్బందులు కూడా ఉంటాయి. ప్రేక్షకుల దృష్టిని కళ్ళపై నుంచి పాత్ర పైకి మళ్ళించడంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. భరతనాట్యంలో మాత్రం ఇవి నాకు అదనపు బలం. అందమైన హీరోయిన్ల జాబితాలో నాకూ స్థానం ఉందని ఓ సారి అమితాబచ్చన్ అన్నారు. అంత పెద్ద నటుడి నుంచి ప్రశంస రావడం ఆనందించాల్సిన విషయమే. భారతీయత ఉట్టిపడే ఆడవారినే మనవారు అమితంగా ఇష్టపడతారన్నది నా అభిప్రాయం. అందుకే జయప్రద, భానుప్రియ, శ్రీదేవి, రేఖ లాంటి వారి అందాలకు ఇప్పటికీ ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంటుంది.

      నన్ను బాగా ఆకట్టుకున్న నటులు మోహన్లాల్, ముమ్ముట్టి, కమలహాసన్. కమల్తో నటించే తొలి రోజుల్లో నేను కాస్త భయపడేదాన్ని. ఇప్పుడు మంచి స్నేహితుడనుకోండి. తెలుగులో అభినందన, రుద్రవీణ నన్ను ఎప్పటికీ గుర్తించుకొనేలా చేశాయి. మొదటిసారి జాతీయ అవార్డు వచ్చినపుడు పట్టలేని ఆనందం కలిగింది. అప్పుడు సినిమాల ఎంపికలో స్వేచ్ఛగానే ఉండేదాన్ని. 2002 సం॥లో “మిత్-మైఫ్రెండ్" సినిమాకు వచ్చిన అవార్డు మాత్రం పాత్ర ఎంపికలో జాగ్రత్త అవసరమని గుర్తు చేస్తుంది. మిత్రి సినిమాలో నాది తల్లిపాత్ర. నా వయస్సుకు మించిన పాత్ర అది, కానీ, రేవతి (ఇద్దరూ మంచి స్నేహితులు) చేయమని అడగడంతో ఒప్పేసుకున్నాను.

       నాట్యం ఆడవారికే అని చాలామంది అంటుంటారు. ప్రఖ్యాత నాట్యకారుల్లో చాలామంది పురుషులే ! ముఖంలో స్త్రీ సహజమైన సౌకుమార్యం ఉండే పురుషులు డ్యాన్స్లో రాణించడం తేలిక. కులేచరన్, మహాపాత్ర, బిర్జు మహారాజ్ డ్యాన్స్ లొ అత్యున్నత శిఖరాలను అందుకోలేదా?

        మణిచిత్రతాళ్ (మళయాళ) సినిమాలో శోభన చేసిన పాత్రను కన్నడంలో సౌందర్య (ఆప్తమిత్ర) తెలుగు, తమిళ్లో జ్యోతిక (చంద్రముఖి) హిందీలో విద్యాబాలన్ (భూలులైయా) చేశారు.

2006 సం||లో పద్మశ్రీ అవార్డు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా అందుకున్నాను. 2025 నాట్య మయూరి, యువకళా భారతి అవార్డులూ వచ్చాయి. ఈ మధ్య రచనలు కూడా చేస్తున్నాను. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు చదువుతారులే అన్న ఉద్దేశ్యంలో రాస్తున్నాను అవన్నీ గొప్ప రచనలుగా పేరుపొందాలనే కోరిక నాకు లేదు. నాలోని ఆలోచనలు అలా పేపరు మీద పెడుతున్నానంతే! ఓ ఆంగ్లపత్రిక నా రచనలను కొన్నింటిని ప్రచురించింది. 

 శోభన వివాహం చేసుకోలేదు బ్రహ్మచారిణి - ప్రేమ విఫలమైన కారణంగా పెళ్ళి చేసుకోలేదని కొందరి మాట.

పొన్నూరి రాఘవేంద్ర